రికార్డ్ స్థాయిలో 1,00,000 డాలర్లకు బిట్ కాయిన్..! 17 d ago
క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ విలువ గురువారం ఏకంగా 1,00,000 (రూ.84 లక్షలకు పైగా) డాలర్లను దాటింది. 4 వారాలలోనే దీని విలువ 45%పెరిగింది. అంటేనే దీని దూకుడు ఏంటో తెలిసిపోతుంది. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలను సడలిస్తానని ట్రంప్ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఇది 1,00,000 డాలర్ల మార్కును దాటేసింది. ఒక దశలో అత్యధికంగా 1, 00,512ను చేరుకుంది.